ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీల లిస్ట్ ఇదే..?!

ఒకసారి హీరో, హీరోయిన్లుగా స్టార్డం వచ్చిన తర్వాత ఆ సార్డంను నిలబెట్టుకోవాలంటే నటీనటులు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి అనే ఫార్మాట్లో వేరే ఇండస్ట్రీలోనూ అవకాశాలు దక్కించుకొని సక్సెస్‌లు అందుకోవాలని తాహ‌తహ‌లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక భాషలో సక్సెస్ వచ్చింది అంటే మరో భాషలో ఇంటర్వ్యూస్ లో పాల్గొని సందడి చేయడం కూడా మనవాళ్లకు బాగా అలవాటయింది. అలా ప్రస్తుతం చాలామంది హీరో, హీరోయిన్లు మూడు భాషల్లో నటించాలని ఆరాటపడుతూ.. ఇతర ఇండస్ట్రీలోనూ అడుగు పెడుతున్నారు. అయితే కొంతమందికి మాత్రమే ఇది సక్సెస్ ఇస్తుంది. గతంలో పూజ హెగ్డే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఒక భాషలో కూడా స‌క్స‌స్ రాలేదు.

When Salman Khan asked Kiara Advani to change her name from Alia, THIS  Ranbir Kapoor film helped her find one - India Today

ప్రస్తుతం ఆమె లైమ్‌ లైట్లోనే లేకుండా పోయింది. శృతిహాసన్, కాజల్ కూడా ఇలాగే ప్రయత్నించినా వారికి కూడా సరైన సక్సెస్ అందలేదు. ప్రస్తుతం ఒకే భాషలో సక్సెస్ సాధిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మూడు భాషల్లోనూ సక్సెస్ సాధించిన వారిలో మొదట కియారా అద్వాని పేరు వినిపిస్తుంది. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ గోల్డెన్ హీరోయిన్గా మారింది. తెలుగులో గేమ్ చేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ స‌ర‌స‌న నటిస్తున్న‌ ఈ ముద్దుగుమ్మ హిందీలో హృతిక్ రోషన్ స‌ర‌సన వార్ 2 సినిమాలో నటించనుంది. కన్నడలో కూడా ఈ అమ్మడు డబ్బింగ్ మూవీలో ఆకట్టుకోనుంది.

Krithi Shetty in an Author-Backed Role in #SHARWA35

నిన్న మొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి.. తాజాగా బిజీ లైన‌ప్‌ ఏర్పరచుకుంటుంది. తెలుగులో నాగచైతన్య తండేల్‌తో పాటు హిందీలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా వ‌స్తున్న రామాయణంలో అలాగే అమీర్ ఖాన్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ‌నున్న సినిమాలోను నటిస్తోంది. మరోపక్క తమిళ్లో శివ కార్తికేయన్ స‌ర‌సన కూడా ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక లేటు వయసులో బిజీ బ్యూటీ గా మారిపోయింది. సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవి స‌ర‌సన విశ్వంభరా సినిమాతో పాటు తమిళ్లో అజిత్ సరసన కమల్ హాసన్ తగ్‌లైఫ్‌ సినిమాలలో నటిస్తోంది.

Keerthy Suresh Stuns in turning heads with her elegance in yellow saree |  Times of India

అలాగే మలయాళంలోనూ రామ్, ఐడెంటిటీ రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి వరుస సక్సెస్ లో అందుకుని వెంటనే వరుస ప్లాపులను చెవిచూసిన కృతి శెట్టి ఇప్పుడు కోలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది. అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో అవకాశాలను అందుకున్న ఈ అమ్మడు మలయాళం లో కూడా ఓ సినిమా ఛాన్స్ ని కొట్టేసింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మహానటిగా క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు తెలుగులో సుహాస్‌ సినిమాలో నటిస్తూనే తమిళ్లో మూడు సినిమాల్లో హిందీలో వరుణ్ ధావన్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. ఇక రష్మిక మందన పాన్ ఇండియా లెవెల్‌లో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది.