మరికొద్ది రోజుల్లో ఎలెక్షన్స్..బిగ్ బాంబ్ పేల్చిన రేణు దేశాయ్.. సంచలన పోస్ట్ వైరల్..!

రేణు దేశాయ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఒక స్టార్ హీరోయిన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అంతేకాదు రేణు దేశాయ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉండడం కూడా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యేలా చేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో రేణు దేశాయ్ మాట్లాడే మాటలు అందరికీ హర్టింగా అనిపిస్తూ ఉంటాయి .

అయితే రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో అలాగే సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతూ ఉండగా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటి..? అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . అసలు ఆమె ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటా..? అంటూ ఆరాతీస్తున్నారు. ఇంతకీ రేణు దేశాయ్ తన పోస్టులో ఏం పెట్టిందో తెలుసా..?

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన చేతికి ఉన్న పచ్చబొట్టున ఫోటో తీసి దానిని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది . అంతేకాదు “కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది ‘ నా పచ్చబొట్టు మౌనం పరమశిలం ‘ అని చెప్తుంది అంటూ పోస్ట్ పెట్టింది”. అంతేకాదు దీనిని రాజకీయాలకి ముడి పెడుతూ ఎలక్షన్స్ 20-24 అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అసలు ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్లు అంటూ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు..!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)