నిన్న మొన్నటి వరకు డమ్మీగా ఉన్న చరణ్.. ఇంత స్టార్ గా మారడానికి కారణం అదేనా..?

రామ్ చరణ్ .. మెగా పవర్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేసుకున్నాడు . రీసెంట్గా డాక్టరేట్ అందుకుని సినిమా ఇండస్ట్రీలో కొత్త సంచలనానికి తెరలేపాడు. అయితే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ కు డాక్టరేట్ రావడం పట్ల చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికగా విషెస్ కూడా అందించారు .

కొందరు మాత్రం హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే మెగా యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు చరణ్ కి సంబంధించిన మరికొన్ని విషయాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ కెరియర్ నిన్న మొన్నటి వరకు కూడా అంత ఆసాజనికంగా ఏమీ లేదు. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ కొట్టాడో.. ఆ హిట్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడో.. తద్వారా ఆస్కార్ అవార్డ్ దక్కేలా చేసుకున్నాడో.. అప్పటి నుంచే రాంచరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది అని..

అంతకుముందు ఆయన నటించిన సినిమాలకు కూడా అన్ని యావరేజ్ గానే నిలిచాయి అని .. మరి ముఖ్యంగా ఆయన నటన స్టైల్ ను డీ గ్రేడ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . అసలు రాజమౌళి లేకపోయి ఉంటే చరణ్ ఈ స్థాయిలో క్రేజ్ దక్కించుకునే వాడే కాదు అని రామ్ చరణ్ కి అవార్డు రావడానికి సగం కారణం ఆయన వెనుక ఉన్న పెద్ద మనుషులే అని .. లేకపోతే రామ్ చరణ్ కి అంత సీన్ లేదు అని.. కావాలనే వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తూ మెగా ఫాన్స్ ను మండిస్తున్నారు మెగా యాంటీ ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతున్నాడు రామ్ చరణ్..!!