అయ్యయ్యో..ఇంటర్వ్యూలో టంగ్ స్లిప్ అయిన శ్యామల.. భర్త పరువు మొత్తం తీసేసిందిగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీ.. చిన్న సెలబ్రిటీ .. నార్మల్ పీపుల్స్ ఇలా వ్యత్యాసమే లేకుండా ఏం మాట మాట్లాడినా సరే ఆ వార్తలు ..ఆ వ్యాఖ్యలు నెట్టింట బాగా స్పీడ్ గా ట్రెండ్ అయిపోతున్నాయి . అదే ట్రెండ్ అయిన వార్తలు ట్రోలింగ్ కి కూడా గురవుతున్నాయి . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్యామల పేరుని ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు .

దానికి కారణం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన భర్త గురించి టంగ్ స్లిప్ అవ్వడమే అంటూ తెలుస్తుంది . ఎప్పటికప్పుడు తన విషయాలను సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలియజేసే యాంకర్ శ్యామల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అని తన కెరీర్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అనే విషయాలను బయటపెట్టింది.

ఈ క్రమంలోనే తన భర్త తనకు డ్రగ్ ఎక్కించాడు అన్న విషయాన్ని బయట పెట్టింది. డ్రగ్ అంటే అదేదో డ్రగ్ కాదు ఆమెకు యాంకరింగ్ అనే డ్రగ్ ఎక్కించాడట. “తనకి ఇష్టం లేకపోయినా తనకి ఆ డ్రగ్ ఎక్కించి ఇండస్ట్రీలో యాంకరింగ్ చేయించాడు అంటూ బయట పెట్టింది”. శ్యామల మాట్లాడుతూ ..”నన్ను బలవంతంగా యాంకర్ గా చేశాడు నా భర్త ..నాకు కాస్తో కూస్తో యాంకరింగ్ అంటే ఇష్టం ..దానిని ఓ డ్రగ్లా నాలో ఎక్కించేసి దానిపై మరింత ఇష్టాన్ని పెంచేశాడు. ఇప్పుడు యాంకరింగ్ చేయనిదే నిద్ర పట్టదు .. ఆ డ్రగ్ అంతలా ఎక్కేసింది “అంటూ చెప్పుకు వచ్చింది. నార్మల్గా శ్యామల మాట్లాడి ఉంటే ఈ వార్తలు పెద్దగా స్ప్రెడ్ అయ్యేటివి కాదు .. డ్రగ్ అన్న పదం యూస్ చేయడం కారణంగా ఆమెను హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . ప్రజెంట్ శ్యామల మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!