“వెర్రి ఫూల్స్..అందుకే క్లీం కార జాతకం బయట పెట్టాను”.. వేణు స్వామీ సంచలన కామెంట్స్..!!

వేణు స్వామి .. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ట్రోలింగ్కి గురవుతూ పలువురు జనాల చేత బూతులు తిట్టించుకుంటూ ఉంటారు. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే . ఎక్కడ ఒక మనిషిని పొగిడే జనాలు ఉంటారో అక్కడే ఆ మనుషులు తిట్టే జనాలు కూడా బాగానే ఉంటారు . కాగా వేణు స్వామిని కొంతమంది బాగా నమ్మితే మరి కొంతమంది ఆయన దొంగ స్వామీజీ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు .

మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఎలా ట్రోల్ చేశారో మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి కు హోస్ట్ నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది . ఆశ్చర్యం ఏంటంటే వేణు స్వామి ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చాడు . వేణు స్వామి., ఉపాసన – రాంచరణ్ ల కూతురు క్లింకార జాతకాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. తాతను మించిపోయే మహాజాతకురాలు అని ఆమెకు చాలా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పుకు వచ్చాడు .

అయితే పాప పుట్టి పుట్టగానే ఎలా జాతకం చెప్తావు ..? అది తప్పు అన్న విషయం నీకు తెలియదా..? అంటూ అప్పట్లో వేణు స్వామిని బాగా ట్రోల్ చేశారు . ఇదే విషయాన్ని హోస్ట్ ప్రశ్నించగా వేణు స్వామి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ” నాకు అన్ని తెలుసు బాలారిష్ట ఉంటే మాత్రమే పిల్లల జాతకాన్ని బయట పెట్టకూడదు.. ఎందుకంటే అప్పుడు వాళ్లకున్న గండాని కూడా మనం చెప్పాలి .. అది తప్పు మెగా మనవరాలు క్లిన్ కార జాతకం సంపూర్ణంగా ఉంది ..ఆమె జాతకంలో ఒక్క దోషం కూడా లేదు .. ఆ కారణం చేతనే బయటపెట్టాను.. ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది అంటూ ఘాటుగా స్పందించారు”. దీంతో వేణు స్వామి ఫ్యాన్స్ మెగా అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. వెర్రీ ఫూల్స్ ఇకనైనా అర్థం చేసుకోండి .. వేణు స్వామి చెప్పిందే నిజం ఆయన చెప్పిందే జరుగుతుంది.. ఆయనను అర్థం చేసుకుంటే అందరికీ మంచిది అంటూ వేణు స్వామిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!