మళ్లీ అదే తప్పు చేస్తున్న మెగాస్టార్.. ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో.. టాలెంట్ ని నమ్ముకొని పైకి ఎదిగిన హీరో ..ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు పదిమంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే కారణం చిరంజీవి ఇచ్చిన ధైర్యం చూసే ..కేవలం ఇండస్ట్రీలో డబ్బు ఉంటే సరిపోదు అని నటన టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అని ప్రత్యేకంగా ప్రూవ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై మెగా ఫాన్స్ మండిపడుతున్నారు .

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి హ్యూజ్ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. దానికి కారణం భోళా శంకర్ సినిమా. ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకుంది. తమన్నా హీరోయిన్గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించింది . ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకోవడమే కాకుండా చిరంజీవి పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగేలా చేసింది . అయితే అంత ట్రోలింగ్ జరిగినాక కూడా చిరంజీవి మళ్ళీ మెహర్ రమేష్ ని నమ్మి ఆయనతో సినిమాను ఓకే చేశాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూట్లో చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు మెహర్ రమేష్. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . దీంతో మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . పోయి పోయి మళ్లీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నావా..? నీ మంచితనం చూసి జాలి పడాలో నీ ఫ్లాప్స్ చూసి బాధపడాలో అర్థం కావడం లేదు.. అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఇంకొకసారి మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇస్తే నీకు ఫ్లాప్ పడడం పక్క ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!