పుష్ప 2 బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలు ఇవే.. ఎన్ని కోట్లు తెరిస్తే నోరెళ్ళబెడతారు..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా నటించి ఫుష్పా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తున్న పుష్ప ది రైజ్‌ సినిమాపై ప్రేక్షకులో మంచి అంచ‌నాలున్నాయి. ఈ సినిమా మొదటి భాగం తెలుగులోనే కాకుండా.. నార్త్ లోను దుమ్మురేపింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు జాతీయ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ సక్సెస్ పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులంతా పుష్ప ది రోల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. 2024 ఆగస్టు 15 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ ఎంత రావచ్చు మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా వస్తాయి.. అని అంచనాలు అప్పుడే వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతాయి అనే అంశంపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి. నార్త్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమాపై ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ రీత్యా మొదటి రోజు హిందీ బెల్టులో పుష్పాది రూల్ సినిమాకు కోట్లలో ఓపెనింగ్స్ రానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa 2 Teaser: Ahead of launch, Allu Arjun 'all set' to deliver a 'high  on adrenaline rush' glimpse from Rashmika Mandanna starrer

దీంతో గతంలో సౌత్ నుంచి నార్త్ కు వచ్చి కలెక్షన్లతో దుమ్మురేపిన సినిమాల లిస్టు మరోసారి వైరల్ గా మారింది. సౌత్ సినిమాలు బాలీవుడ్లో మొదటి రోజు హైవేస్ కలెక్షన్లు కలగొట్టిన సినిమాల్లో టాప్ వన్ పొజిషన్ లో ఉన్న సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 ఈ సినిమా బాలీవుడ్ బెల్ట్ లో ఏకంగా రూ.52.39 కోట్ల గ్రాస్ వ‌సులను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి బాహుబలి 2 రూ.40.73 కోట్లు, అలాగే ప్రభాస్ సాహో మూవీ ఫస్ట్ రోజే రూ.25.82 కోట్ల గ్రాస్ వసూళ్ళ‌ను అందుకుంది. రోబో 2.0.. రూ. 19.74 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పుష్పా 2 సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Decoding Allu Arjun's androgynous jatara look in Pushpa 2 The Rule teaser -  Hindustan Times

ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్ పుష్పది రూల్ సినిమాపై బాగా హైప్‌ను క్రియేట్ చేస్తుందట. నార్త్‌లో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు మొదటి రోజే ఈ సినిమా వసూలు చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పుష్ప పార్ట్ 1 నార్త్‌లో రిలీజై రూ.108 కోట్లు కొల్లగొట్టింది. ముంబై డిస్ట్రిబ్యూటర్స్ నుంచే అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 300 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇదొక అద్భుతమైన ఫ్యాన్సీ డీల్‌ అనడంలో సందేహం లేదు. ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు వారాలైన హౌస్ ఫుల్ తో నార్త్ లో సినిమా ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఓకే రోజున భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. రష్యా తో పాటు 20 కి పైగా దేశాల్లో సినిమాను ఒకేరోజు విడుదల చేయనున్నారట.