ఉపాసన కాళ్లు పట్టుకొని అలా చేస్తున్న రామ్ చరణ్.. ఫిక్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టినా బాబాయి పవన్ కళ్యాణ్ లాగా చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయన సింప్లిసిటీతో ఎక్కడికి వెళ్లినా హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు. మెగాస్టార్ వారసుడుగా అడుగుపెట్టి.. తండ్రికి మించిన తనయుడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు చెర్రీ. ఇక చెర్రీ, ఉపాసనలు లవ్ మ్యారేజ్ చేసుకున్న‌ సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తూ ఉంటారు. ఉపాసనకు.. రాంచరణ్ అంటే ఎంత ప్రేమో.. రాంచరణ్ కూడా ఉపాసన అమ‌టే అంతే ప్రేమ చూపిస్తూ ఉంటుంది.

ఇక చెర్రీ లైఫ్ లో ఉపాసన ఎంట్రీ చరణ్ లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు తెచ్చింది. పాజిటివిటీ కూడా ఎక్కువైందట‌. ఇక తాజాగా అనిల్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు చరణ్.. ఉపాసనతో కలిసి స్పెషల్ చాపర్ లో వెళ్లారు. అందులో అలసిపోయి రిలాక్స్ అవుతున్న ఉపాసన పాదాలను నొక్కుతూ రామ్ చరణ్ ఆమెకు సేవలు చేస్తున్నాడు. ప్రశ్న ఆ వీడియో వైరల్ అవడంతో ఉపాసన చాలా లక్కీ అని.. ఇంత మంచి పర్సన్ ఆమెకు హస్బెండ్ గా దొరకడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక భర్త నుంచి ఏ అమ్మాయి అయినా ఇలాంటి ప్రేమే కోరుకుంటుంద‌ని.. ఉపాసన విషయంలో ఇది నిజమైందని.. ఆ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేసి మరీ ప్రశంసిస్తున్నారు.

Ram Charan is elated after RRR's Golden Globes win, says 'my knees still wobble...' - India Today

ఇక అంతో ఇంతో చరణ్ పై ఉన్న హీటర్స్ కూడా ఈ వీడియోతో ఫ్యాన్స్ అయిపోతారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కపుల్ గోల్స్ లో బెస్ట్ హస్బెండ్ ఉండాల్సిన హ్య‌బిట్స్ అన్ని రామ్‌చరణ్‌లో ఉన్నాయి అంటూ.. త‌మ‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బయట ఎంత పెద్ద గొప్ప హీరో అయినా సరే.. భార్య విషయంలో తన ప్రేమను, సేవను అందించి ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదని.. ఇది నిజంగానే చెర్రీ గొప్పతనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.