వాట్.. బాలయ్య నటించిన ఆ బ్లాక్ బాస్టర్ మూవీని చిరంజీవి రిజెక్ట్ చేశాడా.. కారణం ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫాన్స్ మధ్యన ఎలాంటి వార్‌ ఉంటుందో అందరికీ తెలిసు. అయితే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్యన ఎన్ని గొడవలు ఉన్న ఈ హీరోలు ఇద్దరు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అయితే ఒకరి ఇంటి ఫంక్షన్ లో మరొకరు సందడి చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఎవరి పనిలో వారు బిజీగా ఉండడంతో వారిద్దరు కలవకపోయినా ఇప్పటికీ అదే స్నేహం వారిద్దరి కొనసాగిస్తున్నారు.

Balakrishna, Chiranjeevi come face-to-face on talk show-Telangana Today

ఇక ప్రస్తుతం మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాల‌య్య సీనియ‌ర్‌ హీరోలు అందరిలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. బాలయ్య వరుస హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక కథతో బాలయ్య బ్లాక్ బ‌స్టర్ కొట్టాడన్న సంగతి చాలా మందికి తెలియదు. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్‌లో నరసింహుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే మొదట చిన్నికృష్ణ చిరంజీవికి ఈ సినిమా కథను వినిపించాడట. కానీ చిరంజీవి అప్పుడున్న ఇమేజ్‌కు ఈ స్టోరీ అసలు సెట్ కాదని.. చేయాలా.. వద్దా.. అని చాలా రోజులపాటు రిప్లై ఇవ్వ‌కుండా ఉండి పోయాడట.

Narasimha Naidu Sequel on Cards | cinejosh.com

ఫైనల్‌గా ఈ కథకు చిరు నో చెప్పడంతో చిన్నకృష్ణయ్య ఈ కథను బి.గోపాల్‌కు వివ‌రించాడు. ఆయన స్టోరీని బాలయ్య బాబు దగ్గరకు తీసుకువెళ్లి స్క్రిప్ట్ ఓకే చేయించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య నటించి ఇండ‌స్ట్రీయ‌ల్ హిట్ అందుకున్నాడు. బాల‌య్య‌ నరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు సినిమాతో వరుసగా రెండు ఇండస్ట్రియల్ హిట్లు కొట్టాడు. దీంతో టాలీవుడ్ లెవెల్ లో బాలయ్య పేరు మారుమోగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి బి.గోపాల్ డైరెక్షన్లో ఇంద్ర సినిమా నటించిన సంగతి తెలిసిందే. అది కూడా చిరంజీవి చాలా మార్పులు, చేర్పులు చేయించి మరి నటించాడట. మొత్తానికి అయితే ఈ సినిమాతో చిరంజీవి సక్సెస్ అందుకున్నాడు.