దేవరలో ఎన్టీఆర్ చేత అలాంటి పని చేయిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా .. కొరటాలను కొరికిపడేయరు..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కొరటాల శివ తీసుకున్న నిర్ణయం అభిమానులకి హర్టింగ్గా అనిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 6 కేజీల బరువు తగ్గాడు. ఈ సినిమా కోసం చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .

నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాను ఓ రేంజ్ లో హిట్ చేయాలి అని కాచుకొని కూర్చొని ఉన్నారు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేది. కొన్ని అనివార్య కారణాల చేత అక్టోబర్ 10కి వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక జబ్బు మనిషి పాత్రలో కనిపించబోతున్నాడట.

ఎన్టీఆర్ నత్తివాడి పాత్రలో ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడట . ఎలాంటి డైలాగ్స్ అయినా అవలీలగా చెప్పే ఎన్టీఆర్ నత్తి పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా..? ఆల్రెడీ లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ భారీ దబ్బేసుకున్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి రిస్కులు మనకు అవసరమా కొరటాల ..? అంటూ మండిపడుతున్నారు నందమూరి అభిమానులు . రిజల్ట్ అటూ ఇటూ తేడా ఉంటే ఫాన్స్ వచ్చి కొరికిపడి చంపేస్తారు అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు . కొరటాల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!