ఎన్టీఆర్ -ప్రభాస్ లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. పడి పడి నవ్వుకుంటారు..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరోస్ బాగానే సంపాదించుకుంటున్నారు . పక్క భాష ఇండస్ట్రీలో కూడా తమకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉండడంతో సదరు హీరో పేర్లు బాగా హైలేట్ అవుతున్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

ఎన్టీఆర్ లో ఉన్న అదే క్వాలిటీ ప్రభాస్ లో కూడా ఉంది అంటూ జనాలు ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ప్రభాస్ మంచి ఫుడీ. ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని లాగించే టైప్. అది కూడా ఇష్టమైన ఫుడ్ ఉంటే పక్కన ఎవరు ఉన్నారు అని కూడా చూడడు ..కుమ్మి కుమ్మి పడేస్తాడు . ఎన్టీఆర్ కూడా అంతే మంచి భోజనం ప్రియుడు . నచ్చిన ఫుడ్ ను ఇష్టంగా తింటారు.

వీళ్ళిద్దరికీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టమట . హోం మేడ్ బిర్యానీ అయితే పడి చచ్చిపోతారట. ఎంత డైటింగ్ లో ఉన్నా సరే బిర్యాని కనిపిస్తే ఆగలేరట .. టెంప్ట్ అయిపోయి ఫుల్ గా తినేస్తారట . దీంతో జనాలు సైతం ఈ విషయం తెలిసి నవ్వుకుంటున్నారు. బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ప్రభాస్ కల్కి , ది రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!