అప్పుడు సౌందర్య .. ఇప్పుడు సాయి పల్లవి ..కెరియర్లో అదే తప్పు చేస్తున్నారుగా..!!

సౌందర్య .. సినిమా ఇండస్ట్రీలో మరిచిపోలేని పేరు . ఈమె మన మధ్య లేకపోయినప్పటికీ కోట్లాదిమంది జనాలకు ఫేవరెట్ హీరోయిన్ గా ఉంది ..అంటే ఆమె క్రేజ్ పాపులారిటీ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా సౌందర్య అంటే స్టార్ హీరోలు కూడా లైక్ చేసే వాళ్ళు . కాగా సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె సినిమాల ద్వారా మన మధ్య ఉంది అనుకొని బ్రతికేస్తున్నారు .

ఆమె అభిమానులు ఇండస్ట్రీలో సాయి పల్లవి ఇప్పుడు అలాంటి స్థానమే దక్కించుకునింది. జూనియర్ సౌందర్యగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి కెరియర్లు తీసుకున్న ఒక నిర్ణయం గతంలో సౌందర్య తీసుకున్న నిర్ణయానికి దగ్గరగా ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . సౌందర్య కెరియర్ స్టార్టింగ్ లో చాలా ట్రెడిషనల్ పాత్రలు చేసింది . ఆ తర్వాత హోమ్లి బ్యూటీగా పేరు పడిపోతూ ఉండడంతో అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ లో నటించడం మోడరన్ డ్రెస్సులు వేయడం స్టార్ట్ చేసింది .

అవి కూడా హద్దుల్లోనే ఉండేలా చూసుకునింది.. ఇప్పుడు సాయి పల్లవి అదే స్ట్రాటజినీ ఫాలో అవుతుంది. సాయి పల్లవి అంటే ట్రెడిషినల్ కి మరో మారుపేరు అంటూ ట్యాగ్ పడిపోయింది . రీసెంట్గా సాయి పల్లవి తన సినిమాలో రొమాంటిక్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఇది ఈ ఒక్క సినిమాకే పరిమితమైతే పర్వాలేదు ..ఇది చూసి నెక్స్ట్ సినిమాలకి అలాగే లిమిట్స్ క్రాస్ చేసిందా..? గతంలో సౌందర్య ఎదుర్కొన్న సిచువేషన్ ఇప్పుడు సాయి పల్లవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు..!!