ప్రశాంత్ నీల్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఆ హీరో కూడా…!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న స‌క్స‌స్ ఫుల్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో ప్రశాంత్‌ నీల్‌ ఒకరు. కోలీవుడ్ యంగ్ హీరో య‌ష్‌ తో కేజిఎఫ్ సిరీస్ లను తెరకెక్కించి భారీ బ్లాక్ బ‌స్టర్ స‌క్స‌స్ అందించిన‌ ప్రశాంత్‌.. ఇటీవల పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుని పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. సౌత్ సినిమాల ఖ్యాతిని వేరే లెవల్ కు తీసుకువెళ్లిన ప్రశాంత్ త‌న నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతుంది.

ఇద్దరు పాన్ ఇండియా లెవెల్ స్టార్ సెలబ్రెటీస్ కావ‌డంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. దీంతో వీరిద్దరి మధ్యన సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్‌ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా కలిశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో మెరిసిన తారక్‌ని చూసి దేవర షూటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారేమో అని అందరు భావించారు. కానీ ప్రశాంత్ నీల్ ఇంట్లో ఏదో శుభకార్యం ఉండగా.. తారక్ ఫ్యామిలీతో కలిసి హాజరైనట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్‌ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి తారక్‌ వైఫ్ లక్ష్మి ప్రణతి తో కలిసి హాజరయ్యాడు. అదే ఈవెంట్‌కు కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు.

Pics of Jr NTR Posing With Rishab Shetty and Prashanth Neel at an Event in Bengaluru Go Viral | 🎥 LatestLY

అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక వీరంత ఒక‌రితో ఒక‌రు ఆప్యాయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో వచ్చిన కే జి ఎఫ్, రిషబ్ శెట్టి హీరోగా వ‌చ్చిన‌ కాంతారా సిరీస్‌లు హోంబ‌లే ఫిలిమ్స్ బ్యానర్ పైనే నిర్మించారు. అలా ప్రశాంత్ నీల్, రిష‌బ్ శెట్టి మధ్య కూడా మంచి స్నేహం ఉందట. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ప్రేమ్ లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఫోటో పై భారీగా లైక్‌లు, కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే ప్రశాంత్ – తార‌క్‌ సినిమాలో రిషబ్శెట్టి కూడా నటిస్తున్నాడా అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. ఒకవేళ వీళ్ళ‌ ముగ్గురి కాంబోలో సినిమా వస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బ‌స్టర్ పక్క అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.