పవన్, ప్రభాస్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్..

సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై ఫ్యాన్స్ అంచ‌నాలు మామూలుగా ఉండవు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలంతా కలిసి నటించగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ – వెంకటేష్, మహేష్ బాబు – వెంకటేష్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, చిరంజీవి – రవితేజ ఇలా చాలా మల్టీస్టార‌ర్ సినిమాలు తెరకెక్కయి. అన్ని సినిమాలపై రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ నెలకొంది. వీరి అభిమానుల్లో సందడి వాతావరణం మొదలైంది. దాదాపు ఈ సినిమాలు పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ ఓ పోస్టర్ క్రియేట్ చేశారు ట్రోల‌ర్స్‌.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్ లో ఉన్నారు. అలాగే గతంలో సాహో సినిమాలో ప్రభాస్ సైతం బ్లాక్ కాస్టింగ్ లో ఉన్న ఫోటోని తీసుకుని పవన్ ప్రభాస్ ని మిక్స్ చేసి ఫుల్ కిక్ ఇచ్చేలా ట్రోలర్స్ ఆ పోస్టర్లు డిజైన్ చేశారు. ఆ పోస్టర్ను చూసి ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటూ.. బ్లాక్ బాస్టర్ సక్సెస్ పక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓజి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ వీరి సినిమాల్లో ఎక్కువగా వెపన్స్ యూస్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ రెండు సినిమాలు ఒకే స్క్రీన్ పై కలిసి కనిపిస్తే భలే ఉంటుంది. కాగా ఈ మూవీలో డైలాగ్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కి ప్రభాస్ బ్రదర్ గా ఉంటాడు.. ఇద్దరు అన్నదమ్ములు రౌడీలు.. ప్ర‌త్య‌ర్ధుల‌లో ఓ రౌడీ.. ప్రభాస్ ముఖాన్ని చూసిన వెంటనే భయపడి అందరికీ ఆ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు వీడిని మనం చంపి ఇంటికి వెళ్థం అనుకుంటున్నారా. అక్కడికి వెళ్లే లోపు అవి స్మశానాలుగా ఉంటాయి. ఆ స్మశానాల్లోనే వీడి అన్న మనల్ని పాతేస్తాడు అంటూ ఆ డైలాగ్ ఉంది. వాడి అన్న అర్జున్ పల్వి.. అతనే పవన్ కళ్యాణ్. ఇక వీరిద్దరిని పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఫ్యాన్స్ ఈ పోస్టర్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.