ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్ : బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన రవితేజ.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ తాజాగా నటించిన సినిమా “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా పాజిటివ్ టాక్ అందించుకోవడమే కాకుండా రవితేజకు మంచి కం బ్యాక్ ఇచ్చింది . గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్టు అందుకోలేకపోయాడు . ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .

అంతే కాదు రీసెంట్ గా ఈగల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ బయటపడ్డాయి . ఈ క్రమంలోనే రవితేజ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 6 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరొక 16 కోట్ల కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల వర్షం కురిపిస్తుంది . కచ్చితంగా రవితేజ ఆ ఘనత కూడా సాధిస్తాడు అంటున్నారు అభిమానులు .

విడుదలైన మొదటి రోజే ఈగల్ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం మొత్తం 37.48 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే హిందీలో ఆక్యుపెన్సీ 7.46 శాతం నమోదు అయ్యింది. అంతేకాదు వీకెండ్ కావడంతో జనాలు ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కి ఎగబడుతున్నారు. పెద్దగా కాంపిటీషన్ కి మరో సినిమా కూడా లేకపోవడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!