రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన శర్వానంద్..!

మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్ “. ఇక ఈ సినిమాపై చరన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన శర్వానంద్ కూడా మనకి తెలుసు.

ఇక శర్వానంద్ కి మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సన్నిహితం ఉంటుంది. శర్వానంద్ ఒక్కచరం తోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ఇక తాజాగా శర్వానంద్ మంచు మనోజ్ షో కి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే చరణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

” చరణ్ లో మరియు చిరంజీవి గారిలో ఎంతో మంచితనం. అదేవిధంగా చిరంజీవి గారి లక్షణాలు చరణ్ లో కూడా ఉన్నాయి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే చరణ్ లాంటి ప్రాణ స్నేహితుడు నాకు ఉన్నందుకే. చరణ్ నా ఫ్రెండ్ కావడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శర్వానంద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.