ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు రానా. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే వినూత్నమైన కథలను ఎంచుకుంటూ క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రిజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో కథ బాగుంది ప్రేక్షకులకు నచ్చుతుంది అనిపిస్తే రానా నెగటివ్ రోల్‌లో అయినా నటించటానికి ఓకే అన్న అంశం ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఇక బాహుబలి తర్వాత నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి ప్రయోగాలు చేస్తూ వైవిధ్యమైన పాత్ర ఎంచుకుంటున్నాడు.
కొత్తదనం నిండిన కంటెంట్ కోసం అతడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ హీరణ్య కశిపతో మరోసారి సత్తా చాటాలని రానా నిర్ణయించుకున్నాడు. దీంతోపాటే తలైవార్ 170లో విలన్ పాత్రలో నటిస్తున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే రానా దగ్గుబాటి నెక్స్ట్ బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్క్‌మీడియాలో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు అంటూ న్యూస్ వినిపిస్తోంది. ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. రానా కోసం ఓ మంచి కథను రెడీ చేశారట. దీనికి కొత్త డైరెక్టర్ కిషోర్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుందట.
ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో.. ఇది రానా కెరీర్‌లోనే భారీ సినిమా కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారట. అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇక రానా దగ్గుబాటి తలైవరు 170 సినిమాలో జాయిన్ అయ్యాడు అనే న్యూస్ వైరల్ అయింది. ఇది అతనికి మరో భారీ పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇందులో రానాతో పాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో కనిపిస్తారట. హిరణ్యకశిప, త్లైవర్ 170, ఆర్క్‌మీడియా సినిమాతో రానా మూవీ ఇలా వరుసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో రాణా కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది అని చెప్పవచ్చు.