గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సాయి పల్లవి ఫ్రెండ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది క్రేజ్ కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.అలాంటి వారినే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. మరి కొంతమంది నేమ్ రాకపోతే కనుమరుగవుతూ ఉంటారు.. అలా నేమ్, ఫెమ్ తో పాపులారిటీ వచ్చిన వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు.. ఈమె సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది.

గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ పైన బిగ్ బాస్ పైన పలు రకాల షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచింది.. గత కొద్ది రోజుల నుంచి ఇమే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది.. తాజాగా ఇటీవల ఈమె నటించిన ఫ్లాట్ అనే సినిమాకు ప్రమోషన్స్ లో భాగంగా ఇంస్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించింది అందులో ఈమె ఫేస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.. అనారోగ్య కారణంగా ఈమె చాలా మారిపోయిందని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గాయత్రి గుప్తా ఈ వీడియోలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఈమె నటించిన ఫ్లాట్ సినిమా ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది గాయత్రి గుప్తా. ఈ వీడియోలో గాయత్రి చాలా బోల్డ్ గా కనిపించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గతంలో కూడా ఈమె తనకు డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ వ్యాధికి తన దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవంటూ ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి అంటూ కూడా కోరడం జరిగింది. త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gayathri Gupta (@gayathrigupta)