తాజాగా వరుణ్ – లావణ్య వివాహాన్ని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ పెళ్లి పనులను ఉపాసన కూడా దగ్గరుండి చేసుకుంది. ఓవైపు క్లింకార బాధ్యతలను చూసుకుంటూనే.. మరోపక్క పెళ్లికి సంబంధించిన పనులన్నింటిలో పాల్గొంది. అయితే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్న ఉపాసనకు వరుణ్ తేజ్ పెళ్లిలో జరిగిన ఓ సంఘటన మాత్రం తీవ్రంగా హర్ట్ చేసిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతగా ఉపాసన హర్ట్ అవ్వాల్సిన మ్యాటర్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఉపాసన – రామ్ చరణ్ లకు కూతురు క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే.
ఈ జంటకు పాప పుట్టడంతో అల్లు అర్జున్‌కి కోడలు దొరికింది, అల్లు అయ్యాన్‌కి కాబోయే భార్య దొరికింది అంటూ సోషల్ మీడియాలో నెట్టిజన్ల చూసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల వరుణ్ పెళ్లికి వచ్చిన కొంత మంది అతిథులు కూడా ఇదే విషయాన్ని ఉపాసన వద్ద ప్రస్తావిస్తూ ఉపాసనకి కోపం తెప్పించారట. అల్లు అయ్యాన్ క్లింకారతో కలిసి ఆడుకుంటున్నప్పుడు అలాగే ఆమెను ఆడిస్తున్నప్పుడు బంధువులు ఆ చిన్నపిల్లను చూసి ఇప్పుడే కాబోయే భార్యను ఆడిస్తున్నాడు.. పెద్దయ్యాక వీళ్ళిద్దరూ ఇంకెంత ముచ్చటగా ఉంటారో.. చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు చేశారట. అది విన్న ఉపాసన కోపంతో ఊగిపోయిందట.
ఇదే విషయాన్ని ఉపాసన తన అత్తగారు సురేఖతో మాట్లాడుతూ చిన్న పిల్లవాళ్ళను చూసి అప్పుడే జంట బాగుంది.. పెద్దయ్యాక వీళ్ళకి పెళ్లి చేసేద్దాం అంటున్నారు. ఇద్దరు ఇప్పుడు పసి మనసులు. వారు పెద్దయ్యాక ఎవరి మనసు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అలాంటిది ఇప్పుడే వారి పెళ్లి గురించి వాళ్ళ ముందు మాట్లాడడం అసలు నాకు నచ్చలేదు అత్తయ్య అంటూ చెప్పుకొచ్చిందట. ఉపాసన మాటలు విన్న సురేఖ చుట్టాలు అన్నాక అలాగే మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉపాసన.. లైట్ తీసుకో అంటూ చెప్పిందట. ఉపాసన మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని పెళ్లి లో అంత డల్‌గా ఉందట.