స్టార్ హీరో సినిమాలో విలన్ గా సునీల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు.. మళ్లీ పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన సునీల్ కు మర్యాద రామన్న సినిమాతో మంచి హోప్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్న సునీల్ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించడం జరిగింది.

Kiccha Sudeep to only campaign for BJP, won't join party; Take a look at  actor's best roles | Celebrities News – India TV

అయితే పుష్ప సినిమాలో ఎప్పుడైతే విలన్ గా నటించారో సునీల్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఇతర భాషలలో కూడా నటిస్తూ మరింత క్రేజ్ అందుకున్న సునీల్ ఇప్పుడు ఏకంగా శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. పుష్ప తరహాలోనే నెగిటివ్ రోల్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75% సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందట.

మిగిలిన భాగాన్ని మహాబలిపురంలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.సునీల్ సినిమా లో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలయిపులి ఎస్ దాస్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సునీల్ శాండిల్ వుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హోర్నడ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ తర్వాత ఒక సినిమాలో చేయనున్నారు. సునీల్ ను మ్యాక్స్ సినిమాలు తీసుకోవడంపై శాండిల్ వుడ్ లో మిశ్రమ స్పందన లభిస్తోంది.