బిగ్ బాస్ 7 లో ప్రారంభం కానున్న ఫ్యామిలీ వీక్…. మరి ఎవరి కోసం ఎవరు వస్తారో తెలుసా…!!

బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రసవత్తంగా సాగుతుంది. మొదట ఉల్టా పుల్టా అని చెప్పినట్లుగానే… కొనసాగుతుంది. గత ఆరు సీజన్ల‌లో కూడా ఫ్యామిలీ వీక్ తప్పనిసరిగా ఉండేది. ఆ వీక్ మొత్తం జనాలకి ఎంటర్టైన్మెంట్… వాళ్లకి హ్యాపీనెస్ కూడా దక్కేది. ఈ సీజన్లో ఇంకా ఫ్యామిలీ వీక్ మొదలవ్వలేదు. ఎప్పుడు మొదలవుద్ది? అసలు ఎవరి కోసం ఎవరు వస్తారు? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

ఈ ఆదివారం ఎలిమినేషన్ పూర్తయిన అనంతరం. 11 మంది కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వనున్నారు… అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ షో ఉల్టా పుల్టా అయినందున… వీళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న సెలబ్రిటీలు సైతం ఎంటర్ అవ్వనున్నట్లు సమాచారం. మరి ఏ కంటెస్టెంట్ కోసం ఎవరు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శివాజీ:
శివాజీ కోసం తన భార్య, కూతురు హౌస్ లోకి ఎంటర్ కానున్నారు.

2. పల్లవి ప్రశాంత్:
రైతు బిడ్డ కోసం అతని తండ్రి హౌస్ లోకి వెళ్ళనున్నాడు. అంతేకాకుండా సపోర్ట్ చేస్తున్న సోహిల్ సైతం ఎంటర్ కానున్నాడు.

3. అమర్ దీప్:
అమర్ కోసం తన భార్య తేజస్విని వెళ్లనుంది.

4. యావర్:
ప్రిన్స్ యావర్ కోసం తనకి ఎంతో ఇష్టమైన తన అన్నయ్య హౌస్ లోకి ఎంటర్ కానున్నాడు.
5. అర్జున్:
అర్జున్ కోసం అతని భార్య సురేఖ వెళ్లనుంది.

6. గౌతమ్:
గౌతమ్ కృష్ణ కోసం ఆయన తల్లి మంగాదేవి హౌస్ లోకి ఎంటర్ కానుంది.

7. ప్రియాంక:
ప్రియాంక కోసం ఆమె బాయ్ ఫ్రెండ్ శివ వెళ్ళనున్నాడు.

ఈ వీక్ మొత్తం సందడిగా జరగబోతుంది. వాళ్ల ఫ్యామిలీతో వాళ్లకున్న బాండింగ్ చూపిస్తూ ప్రేక్షకులని సైతం కంటతడి పెట్టిస్తాడు బిగ్ బాస్. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసి కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.