మరోసారి మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఏం చేశాడంటే..?

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్. తరువాత ప‌లు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. సందీప్ వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వెంటనే గీతగోవిందం సూపర్ హిట్ కావడంతో రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ వెనకాడడు విజ‌య్‌.

 

 

View this post on Instagram

 

A post shared by Ram Mohan Naidu Kinjarapu (@rammnk)

ఇటీవల ఖుషి సినిమా హిట్ సందర్భంగా తన రెమ్యూనరేషన్ నుంచి కోటి రూపాయలను వంద కుటుంబాలకు సహాయంగా అందించాడు విజ‌య్‌. అలాగే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పేరుతో ఎన్నో కుటుంబాలకు సహాయం అందిస్తున్నాడు. కోవిడ్ లాక్ డౌన్ టైం నుంచి ఇప్పటికీ కూడా ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. కరోనా టైంలో వైద్య సహాయం పొందలేక చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేసిన విజయ్ ఓ ట్రాన్స్ జెండర్ టీంకు కూడా సహాయం చేశాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ విజయ మాకు ఎంతగానో సహాయం చేశాడని.. లాక్ డౌన్ కర్ఫ్యూ టైంలో బయటికి వెళ్లి, ఆహారం మందులు కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పింది.

ట్రాన్స్ జెండర్లమైన మాకు డబ్బు కావాలి ఆ సమయంలో ఎవరైనా సహాయం చేస్తారా అని ఇంటర్నెట్‌లో వెతికితే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి వచ్చిందని.. సాయం కావాలని ఒక షామ్‌ నింపి ఫౌండేషన్ కు పంపానని.. నిమిషాల్లో వారి వైపు నుంచి ఫోన్ చేసి ఏం కావాలని అడిగారు.. అప్పుడు స్టోర్ కి వెళ్లి అవసరమైన వస్తువులు కొని ఆన్లైన్లో పంపించండి.. బిల్లు చెల్లిస్తామని చెప్పారు. వెంటనే స్టోర్‌కి వెళ్ళి తెచ్చుకున్నాము. వాళ్లు బిల్లు కట్టారు. విజయ్ సార్ పెట్టిన భోజనం నెలరోజుల పాటు మేము తిన్నాము. నాకే కాదు నాలాంటి 20 మందికి విజయ్ సహాయం అందించారు. ఆయనను కలిసే అవకాశం వస్తే కచ్చితంగా థాంక్స్ చెప్పాలి అంటూ వివరించింది.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల ప్రమాదవశాత్తు కాలును కోల్పోయిన చిన్నారికి లక్ష రూపాయలు సహాయం అందించాడు విజయ్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన ఈ పాప ఇటీవల ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల చక్ వారికి అందేలా చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ఈ మంచి పనులన్నీ మీడియాలో వైరల్ కావడంతో దటీజ్‌ విజయ్ అంటూ.. విజయ్ దేవరకొండ మంచి మనసు ఎప్పుడు ఇలాగే ఉండాలి.. నలుగురికి సాయం చేస్తూ ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.