వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ల్… ఇంతకీ అది ఏంటో తెలుసా….!!

ప్రముఖ ఇన్స్‌టెంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్ తో పాటు ఇతర ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు పలు వార్తలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ల్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా?

వాట్సాప్ త్వరలో సీక్రెట్ కోడ్ ఫీచర్, సెర్చ్ ఫీచర్ ఫర్ అప్డేట్ ట్యాబ్, పిన్స్డ్ మెసేజెస్, రీడైజన్చాట్ , ఐపీ ప్రైవసీ ఫీచర్లపై పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో సీక్రెట్ కోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తరువాత మిగిలిన ఫీచర్ల అప్డేట్ కానున్నాయి. వాట్సాప్ అప్డేట్లను అందించే వీబీటా ఇన్ఫో తాజాగా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లోని 5 ఫీచర్ల వివరాల్ని వెలుగులోకి తెచ్చింది.

సీక్రెట్ కోడ్ ఫీచర్:
ఫోన్ లో మెయిన్ పాస్వర్డ్ ఎలా ఉందో.‌‌. ఇప్పుడు వాట్సాప్ లోని చాట్ లకు పిన్, బయోమెట్రిక్ అథంటికేషన్ను అందుబాటులోకి తేనుంది. ఫోన్లో మీరు చేసిన పర్సనల్ చాటింగ్, ఫొటోస్, వీడియోలు ఇతరులు చూసే వీలుండదు. అంతేకాదు మీరు లాక్ చేసిన ఆ చాటింగ్ సమాచారం అంతా సపరేట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఒకవేళ అగంతకులు ఆ చాట్ ను ఓపెన్ చేసి చూడాలంటే మీరు ఎంటర్ చేసిన పిన్ లేదంటే బయోమెట్రిక్ అథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

సెర్చ్ ఫీచర్:
ఆ ఫీచర్ ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫిచర్ సాయంతో మీరు ఫాలో అయ్యే వాట్సప్ , వెరిఫైడ్ చానల్స్ లో ఎవరెవరు ఏం స్టేటస్ పెడతారో సర్చ్ బటన్ ఫీచర్లో పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

పిన్న్డ్ మెసేజ్స్:
పిన్న్డ్ మెసేజ్స్ ఈ ఫీచర్ సాయంతో ముఖ్యమైన మెసేజ్లను చాట్ కన్వర్షన్ లో మీకు ప్ర‌ధానంగా కనపడేలా పిన్ చెయ్యొచ్చు.

రీడిజైన్ చాట్ అటాచ్మెంట్:
రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ అప్డేట్ తో వాట్సాప్ ఫ్రెష్లుక్ తో కనిపించనుంది. వాట్సాప్ లో వీడియో, కంటెంట్, ఆడియో ఫైల్స్ షేరింగ్ చేసే విధానం మారనుంది.

ఐసీ అడృస్ ను కనిపెట్టలేదు:
అగంతకులు మీ వాట్సాప్ ఐసీ అడృస్ ను కనిపెట్టలేరు. యూజర్లు సాధారణంగా ఐసీ అడృస్ తో వాట్సాప్ లో మనం చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇతర వివరాల్ని సేకరించవచ్చు. అయితే తాజాగా అప్డేట్ తో ఐసీ అడ్రస్ గుర్తించలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్లను అప్డేట్ చేయనుంది.