టైటానిక్ హీరో హీరోయిన్ ధరించిన ఈ దుస్తులు ఎన్ని కోట్లు అమ్ముడుపోయాయో తెలుసా..?

జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటే.. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందమైన ప్రేమ కథ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అద్దుకున్నారు. ఇప్పటికి టాప్ కలెక్షన్స్ లో మొదటి స్థానంలో ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు.. టైటానిక్ లో జాక్ -రోజ్ ల విషాదంతా ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

HD wallpaper: love, mood, Kate, babes, Titanic, actress, actor, emotion,  women | Wallpaper Flare

ఈ సినిమా డిసెంబర్ 19..1997లో విడుదలవగా అప్పటి కాలంలోనే బాక్సాఫీస్ వద్ద పెను సంచలన విజయాలను సృష్టించింది. టైటానిక్ సినిమాలు లియోనార్డ్ డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరో హీరోయిన్లుగా నటించారు 1997లో విడుదలైన ఈ సినిమా పాత్రలో వీరు జీవించేసారని చెప్పవచ్చు.

తాజాగా వీరు ధరించిన దుస్తులు వేలానికి తీసుకురావడం జరిగింది . హీరోయిన్ వేసుకున్న దుస్తులు ఏకంగా కోటి రూపాయల ధరకి పలికినట్లు తెలుస్తోంది ఇక టైటానిక్ హీరో ధరించిన ఫ్యాంట్ కాలర్ లెస్ వైట్ షర్ట్ చొక్కా వేలానికి ఉంచగా ఈ దుస్తులు దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.

అయితే ఇ వెలం నవంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు లండన్ లో జరగబోతోంది.. అలాగే టైటానిక్ సినిమాలో హీరోయిన్ ధరించిన కేట్ డ్రెస్ వేలానికి వేయగా ఓవర్ కోట్ ను సెప్టెంబర్ 13న వేలం వేయబోతున్నారట. టైటానిక్ లో వాడిన కాస్ట్యూమ్స్ తో పాటు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ యాక్షన్ సన్నివేశాల సమయంలో ఉపయోగించిన దుస్తులు కూడా కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ఫారెస్ట్ గంప్ లో టామ్ హంక్స్ ధరించిన స్పీకర్స్ వంటి వస్తువులను కూడా వేలంలో వేయబోతున్నారట.