వాటర్ టిన్లలో నీళ్లు తాగుతున్నారా అయితే ప్రాణాలకు ముప్పు కొన్ని లెచ్చుకున్న‌ట్లే..!!

ఇటీవల కాలంలో అభివృద్ధి పేరుతో వినాశనాన్ని కలిగించుకొని మరి బతికేస్తున్నాం మనం కూర్చునే కొమ్మని మనమే నరికేస్తూ లగ్జరీ లైఫ్ అనే పేరును పెట్టుకుంటున్నాం. మార్చే శక్తి మార్చుకునే ఓపిక లేక మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం అవే మన చావుకి కారకమౌతున్నాయి. మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ తో ఉన్న మన సంబంధం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ముఖ్యంగా మనం ఇంట్లో వాడే నీళ్లు.. తాగే ప్లాస్టిక్ టిన్‌ల‌ నుంచి ప్లాస్టిక్ బాటిల్ వరకు మొత్తం జీవితాన్ని ప్లాస్టిక్ చేస్తున్నాం.

ప్లాస్టిక్ ప్రాణాలకు హాని చేస్తుంది.. పర్యావరణానికి కీడు చేస్తుందని తెలిసినా కూడా ప్లాస్టిక్ ను వినియోగిస్తూనే ఉంటున్నాం. ప్లాస్టిక్ పాత్రలో బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిపై ఇటీవల న్యూయార్క్ చెందిన విశ్వవిద్యాలయం ఓ ప్రయోగం ద్వారా కొన్ని విషయాలను వెల్లడించింది. భారతదేశంలో పాటు పలు దేశాల్లో మూడు నెలల పాటు అన్ని రకాల బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ పై టెస్ట్‌లు జరిపిన ఈ సర్వే.. కొన్ని విషయాలను వెల్లడించింది. ఒక్క లీటర్ ప్లాస్టిక్ బాటిల్ లో పదివేల ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయట. మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. కుళాయి నీటితో పోల్చి చూసినట్లయితే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండి హాని కలిగిస్తున్నాయి.

ఇలానే ప్లాస్టిక్ బాటిల్స్ లో, అలాగే ప్లాస్టిక్ పాత్రలో నిలువ ఉన్న నీటిని తాగినట్లయితే క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని.. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రాగి గ్లాసులో, రాగి బాటిల్స్ లో నీటిని తాగడానికి ప్రాధాన్యత నివ్వాలి. నీటిని నిలవంచటానికి మట్టి పాత్రలు లేదా స్టీల్ బిందెలను వినియోగించాలి అని సూచిస్తున్నారు. ఇక ఆల్రెడీ మార్కెట్లో రాగి మెటల్ తో వాటర్ బాటిల్స్ వస్తున్నప్పటికీ ధర గురించి ఆలోచించి చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.. కానీ ఒక్కసారి కాస్త ధర ఎక్కువైనా రాగి లేదా స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్ని వాటిలో నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.