పదేపదే టీని వేడి చేసుకుని తాగటం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలుసా.. ఏమౌతుందంటే..?

భారతదేశంలో దాదాపు 70% మంది వేడివేడి టీం తాగడానికి ఇష్టపడుతుంటారు. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కచ్చితంగా రోజుకి రెండుసార్లైన టీ తాగుతారు. అయితే ఒకసారి చేసుకున్న టిని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. కానీ నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

మిగిలిపోయిన టీలో ఫంగస్, బ్యాక్టీరియా లాంటి క్రిములు పెరుగుతాయి. ఇది అనారోగ్యానికి దారి తీస్తాయి. మిల్క్ టీ మళ్లీ 41 నుంచి 140 డిగ్రీల ఫారం హిట్ మధ్య వేగంగా హీట్ చేయబడుతుంది. దీని ద్వారా బ్యాక్టీరియా తొలగిదు స‌రి క‌దా చెడు రుచి కూడా ఏర్పడుతుంది. హెర్బల్ టీని మళ్లీ వేడి చేసినప్పుడు దానిలోని పోషకాలు, కణిజాలన్నీ పోతాయి.

ముఖ్యమైన నూనెలు ప్రయోజకరమైన సమ్మేళనాలు నశిస్తాయి. దీంతో ఈ టీ తాగడం వల్ల ఉపయోగం ఉండదు. దీని ఎక్కువ సేపు నిలువ ఉంచడం వల్ల టానిన్ అధికంగా రిలీజై చేదు రుచులు కలిపిస్తుంది. కడుపునొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం, వికారం, జీర్ణ సమస్య ఇబ్బందులు లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.