అధిక ఒత్తిడితో మధుమేహం.. నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..?

మనుషులలో ఉండే మానసిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతోందన్న సంగతి మీకు తెలుసా.. ఒత్తిడి ఒక మనిషి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను మరియు ఫ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేస్తుందని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు. అధిక స్థాయి ఒత్తిడి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట‌. కనుక మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా మీ ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇక ఒత్తిడికి మధుమేహానికి మధ్య సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

17వ దశాబ్దం నుంచి పరిశోధకులు చేస్తున్న పరిశోధనల ప్రకారం డిప్రెషన్ మరియు యాంగ్జైటీ ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. వివిధ రకాల స్ట్రెస్లకు గురి అయిన వ్యక్తిలో మధుమేహం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా సూచిస్తుంది. సాధారణంగా మెంటల్ స్ట్రెస్, కోపం, శత్రుత్వం, వర్క్ స్ట్రెస్, బాధ మ‌ధుమేహాన్ని పెంచుతాయట. అధ్యయనాలు చెప్పిన సమాచారం ప్రకారం నెదర్లాండ్ లోని ఆమ్‌స్టార్‌డామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒత్తిడి మధుమేహానికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.

ఇటీవల కాలంలో హై స్ట్రెస్‌.. జీవనశైలి కారకాలపై ప్రభావం చూపుతుంది. ఓ వ్యక్తికి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచడానికి హైస్ట్రెస్‌ ముఖ్య కారణంగా మారుతుంది. అలాగే నాణ్యతలేని ఆహారం తీసుకోవడం.. వ్యాయామం లేకపోవడం.. ధూమపానం, మద్యపానం మొదలైనవి స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావితం చూపిస్తాయి. స్ట్రెస్ హార్మోన్లు పనితీరుకు అడ్డుపడి ఇన్సులిన్ పని విధానాన్ని ఆపివేస్తుంది. ఒత్తిడి హైపోదలని పిట్యూటరీ అడ్రినల్ మరియు సెక్స్ హార్హోన్‌ల స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. సానుభూతిని వ్యవస్థ పనితీరును అడ్డుకుంటుంది.