“నేను చచ్చిపోతే అదే చేయండి”..పిల్లలకు యాంకర్ సుమ అలా చెప్పింది ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఉన్న సుమ తన పిల్లలకు ఇచ్చిన సజెషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు సరదా సరదాగా నవ్వుతూ చలాకిగా అలరిస్తూ సంతోషంగా ఉండే సుమ తాను చనిపోతే ఏం చేయాలి అనే విషయాన్ని పిల్లలకి చెప్పడం అది కూడా స్వయంగా ఆమె డిక్లేర్ చేయడం ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమ తన పిల్లలకు తాను చనిపోతే ఏం చేయాలో ముందుగానే చెప్పాను అని చెప్పుకొచ్చింది . ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు తమ భర్తలకు ఏదైనా అయిపోతుంది అని చెప్పిన .. లేదు వాళ్లకు ఏదైనా జరగడానికి జరిగి బ్రతుకుదెరువు కోసం పనికొచ్చిన కనీసం అకౌంట్ అనేది కూడా ఉంటుందని వాళ్లకు తెలియదని.. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నా పిల్లలకు నేను చనిపోతే మీకు ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది .

ఎక్కడినుంచి డబ్బులు వస్తాయి..? ఏం చేయాలి ..? అని క్లియర్ గా చెప్పేసానని.. దీంతో వాళ్ళు షాక్ అయిపోయి ఎందుకు మమ్మీ ఇలా చెప్తున్నావు అంటూ అడిగారని ప్రతిదీ తెలుసుకోవాలి మనిసి అన్నాక  పుట్టుక మరణం సహజం .. ఎప్పుడో ఒకసారి చచ్చిపోవడం కన్ఫామ్.. అది ముందుగానే క్లియర్ గా చెప్పి పెడితే పిల్లలకు ధైర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సుమ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!