ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసిన క‌ధ‌తో హిట్ కొట్టిన మహేష్ బాబు.. ఏ మూవీ అంటే..?

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస‌ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దుర‌దృష్ట‌వశాతు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో నెమ్మ‌దిగా అత‌డికి సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో డిప్రెషన్‌కు లోనైనా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉదయ కిరణ్ కు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో మహేష్ బాబు నటించిన హిట్ తన ఖాతాలో వేసుకున్నాడంటూ న్యూస్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు దాటుతున్న ఇంకా అదే క్రేజ్ తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో మహేష్ బాబు నటించిన సినిమాలలో అతడు ఒక‌టి. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. 2005 ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ మూవీ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక ఈ మూవీ మొదట త్రివిక్రమ్ ఉదయ్ కిరణ్‌తో తెర‌కెక్కించాల‌ని భావించాడట. అయితే ఉదయ్ కిరణ్ కథ నచ్చినా అప్ప‌ట్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా డేట్లు అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో నటించి ఉంటే అతని ఖాతాలో మరో అద్భుతమైన సినిమా నిలిచిపోయి ఉండేది అంటూ.. మహేష్ బాబుకు తప్ప ఇలాంటి క్యారెక్టర్ మరెవరికి అంతగా సూట్ అయ్యేది కాదు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.