ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పర్ఫెక్ట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు . ఎక్కడ ఎలాంటి సినిమాలు చేయాలి .. ఏ మూవీస్ చేస్తే మనకు ఆఫర్స్ వస్తాయి.. ఏ హీరోతో నటించాలి అని ముందుగానే కమిట్ అయిపోతున్నారు . అదే లిస్టులోకి వస్తుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల . ఆమె బాడీకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయి .. ఏ హీరోతో చేస్తే ఆమె క్రేజ్ పెరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు.
అందుకే భగవంత్ కేసరి సినిమాలో కూతురు పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నా అనిల్ రావిపూడి ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఆయన చెప్పింది చెప్పినట్లు నటించింది . తద్వారా ఓ బిగ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది . భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ఎంత కారణమో .. అదే రేంజ్ లో కారణం శ్రీ లీలా అంటూ కూడా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు .
అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల కు “లిప్ కిస్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తారు అన్న ప్రశ్న ఎదురైంది..?”.. అయితే శ్రీలీల మాత్రం ఏ హీరోకి డైరెక్ట్ గా లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పేసింది. అంతేకాదు తన భర్తకి తప్పిస్తే మరొకరికి ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో శ్రీ లీల మాటలు వైరల్ గా మారాయి..!!