ఎలక్ట్రానిక్ సైకిల్ తో టైప్ 2 డయాబెటిస్ దూరం.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే..?

సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం అని అందరికీ తెలుసు. ఆరోగ్యానికి కూడా ఎంత‌గానో మేలు చేస్తుంది. అయితే స్కూటర్‌లు, బైక్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిందిసైకిల్ వాడ‌కం త‌గ్గింది. దీంతో శారీరక శ్రమ పూర్తిగా లేకుండా పోయింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి వ్యాయామం మంచి మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సైకిల్ ఉపయోగించేవారు టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచించారు. పరిశోధకులు దీనికి సంబంధించి ఓ లాజిక్ వివరించారు.

టైప్ 2 డయాబెటిస్ బాధితులు ఎక్సర్సైజ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. అయితే ఎలక్ట్రానిక్ సైకిల్‌ ఉపయోగిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. సాధారణంగా కాళ్లతో తొక్కే సైకిల్ లాగా ఉపయోగిస్తూనే.. మరోవైపు బ్యాటరీ సహాయంతో పనిచేసే ఎలక్ట్రికల్ సైకిల్ గాను పనిచేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ ప్రెసిడెంట్ లో నిర్వహించిన ఓ పరిశోధనలో సాధారణ సైకిల్‌తో పోలిస్తే ఎలక్ట్రానిక్ సైకిల్ ప్రజలను సైక్లింగ్ చేయడానికి ఎక్కువగా ప్రేరేపిస్తుందని తెలిసింది.

కాసేపు బ్యాటరీతో సైకిల్ నడిపినా.. కాసేపు కాళ్లతో సైకిల్ నడుపుతున్నారని నిపుణులు వివరించారు. దీంతో సహజంగానే వ్యాయామం చేసినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సైక్లింగ్ ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో డైటింగ్ ఇతర వ్యాయామాల కంటే సులభమైన మార్గం అని వివరిస్తున్నారు. కండరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సైక్లింగ్ ఎంతగానో సహకరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఫెడల్ అసిస్ట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుందట.