దాదాపు 22 ఏళ్ల తరువాత మురారి సినిమాకి సీక్వెల్ తీస్తున్న స్టార్ డైరెక్టర్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ సినిమానే  మురారి . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు చాలా చాలా క్లాస్ లుక్స్ లో కనిపించగా సోనాలి బింద్రే నాటి లుక్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది . ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది  అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సోనాలి బింద్రే కూడా తెలుగులో ఆఫర్స్ దక్కించుకుంది  ఈ సినిమాతోనే.  ఇప్పటికి సోనాలి బింద్రే పేరు మనం గుర్తుపెట్టుకున్నాము అంటే దానికి కారణం మురారి సినిమా అని మర్చిపోకూడదు.  అయితే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో వీళ్లిద్దరూ బావ మరదలుగా కనిపిస్తే మరింత నాటినెస్ కనిపిస్తుంది అంటున్నారు జనాలు,  సోషల్ మీడియాలో మురారి 2 హష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!