బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిబి షాలో అడుగుపెట్టి ఉన్నది ఐదు వారాలు అయినా మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ఒడిస్సా బ్యూటీ. బిగ్‌బాస్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆకట్టుకుంది. అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాప్ సెవెన్ కంటిస్టెంట్లలో ఒకరిగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ ఇలా సడన్‌గా ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఎలిమినేట్ అవ్వడం ఆమె బ్యాడ్ లక్ అంటూ కొంతమంది కామెంట్ చేశారు.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఓ బంపర్ ఆఫర్ ని కొట్టేసిందట. ఇంతకీ ఏంటా బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని అందుకుంది శుభశ్రీ. తను స్వయంగా ఈ విషయాన్ని చెప్తూ నా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడానికి.. స్క్రీన్ ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.. పక్క పవర్ స్టార్ అభిమానిగా ఆయన ఓజీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.
నాలో ఉన్న టాలెంట్‌ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్ మూవీస్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిక్షణం నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రేమిస్తున్న నా అభిమానులకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేసింది. శుభశ్రీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇదే కదా లక్కీ ఛాన్స్ అంటే అంటూ.. బంపర్ ఆఫర్ కొట్టేసావుగా సుబ్బు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు