ఉప్పుని మరీ తగ్గిస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..

ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేసి మొహం ఉబ్బినట్లు చేస్తుందనే ఉద్దేశంతో చాలామంది మహిళలు ఉప్పును చాలా తక్కువ మోతాదులు తీసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. అయితే సాధారణంగా ఉప్పుని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అలా అని ఉప్పును మరీ తగ్గించడం కూడా మంచిది కాదట. ఉప్పును మితంగా వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ వాడితే రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్స్ లాంటి ప్రమాదాలకు దారి దారితీస్తాయి అనేది నిజమే.. కానీ మితంగా ఉప్పును వాడాలి. రోజుకు 5 గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎన్నో రకాల లాభాలనుఇస్తుంది.

ఉప్పులో సోడియం ఉంటుంది. కణాల పనితీరుకి శరీరంలో ద్రవాల నిర్వహణకు ఎలెక్ట్రోలైట్ల సమతుల్యంలో ఉండడానికి సోడియం కావాలి. క్యాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం లాంటి సాధారణ ఎలక్ట్రోలైట్లు మనం తీసుకునే ఆహార ద్రవాల ద్వారానే మన శరీరానికి చేరుతాయి. ఎలక్ట్రోలైట్ల సమతుల్యం తగ్గితే మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నవారు మాత్రమే ఉప్పును బాగా తగ్గించి తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది. సాధారణ వ్యక్తులు ఉప్పును మితంగా తీసుకోవాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పును తీసుకోవాల్సిన దానికంటే అతి తక్కువగా తీసుకోవడం వల్ల హైపోనెట్రీమియా అనే సమస్య వస్తుందట.

హైపోనెట్రీమియా ల‌క్ష‌ణాలు..
దీని కారణంగా శరీరంలో కండరాలు, కణాలు వాపుకి గురవుతాయి. రక్తపోటు పై ప్రభావం పడుతుంది. రోజుకి 2 .4 గ్రాములు కంటే తక్కువగా ఉప్పుని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి బాగా తగ్గిపోతుంది. మూత్రపిండాలు ఉప్పుని బయటకు పంపకుండా నిలిపి ఉంచుతుంటాయి. అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్లు అసమ‌తుల్యత ఏర్పడి కళ్ళు తిరగడం, తలనొప్పి, అలసట ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

పిండి పదార్థాలను పూర్తిగా ఆపేసి ప్రోటీన్లు కవులు ఉన్న కీటో డైట్ ని తీసుకునే వారిలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. హైపోనేట్రీమియా తక్కువగా లేదా మధ్యస్థ స్థాయిలో ఉంటే ఆపై చెప్పిన లక్షణాలన్నీ ఉండవచ్చు. ఇదే హైపోనిట్రీమియా సమస్య మరి తీవ్రంగా ఉంటే మూర్చా, కోమా, మెదడు గాయపడటం లాంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. కనుక ఉప్పు విషయంలో వైద్యులు సలహా లేకుండా సొంత నిర్ణయాలను తీసుకోకూడదు.