నా ఎలిమినేషన్ కు కారణం అతనే.. శుభశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

ఈ ఏడాది బిగ్ బాస్ 7 మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తికాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వెళ్లిపోయారు. అయితే ఈ వారంలో నామినేషన్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎవరు ఊహించని విధంగా ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టి మరొకరిని ఎలిమినేట్ చేశారు. ఈవారం శుభశ్రీ నామినేట్ అయ్యింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హౌస్ మేట్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. నేను విన్నర్ అవుదామని వచ్చాను కానీ కుదరలేదు.. అయితే హౌస్ లో డీలక్స్ రూమ్‌లోని ఓ ప్లేస్ ను చాలా మిస్ అవుతానని తెలిపింది. హౌస్ లో లవ్ ట్రాక్స్ నడిచాయ అని గీతూ ప్రశ్నించగా.. శుభశ్రీ చెబుతూ.. ఆ ఛాన్సే లేదంటూ సమర్థించుకుంది. ఆ తర్వాత గౌతమ్ చేతిలో ఒక బొమ్మ శుభశ్రీ నిజమేనా? అని ప్రశ్నించడంతో.. అలాంటిదేం కాదంటూ చెప్పుకొచ్చింది. మీరు బయటికి రావడానికి ఎవరు కారణమని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. కచ్చితంగా అమర్‌దీప్ వల్లేనంటూ అనౌన్స్ చేసింది.

అంతేకాదు హౌస్ లో గౌతమ్ న‌మ్మదగిన వ్యక్తి కాదని శుభశ్రీ వెల్లడించింది. కాగా.. ఐదో వారంలో మొత్తం ఏడుగురు నామినేట్ కాగా శివాజీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచి శుభశ్రీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. గౌత‌మ్‌ని బిగ్ బాస్ సీక్రెట్లో బంధించాడు. ఇక ఇప్పటి నుంచి బిగ్ బాస్ 2.0 అంటూ మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి వదిలాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.