వెంకటేష్ సినీ కెరీర్ లో ఆ రెండు మూవీస్ అంత ప్రత్యేకమా..

దగ్గుబాటి రామానాయుడు నట వరుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వెంకీ తన మార్కు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వెంకటేష్ కు మాస్ హీరోగా చేయాలని ఆశ మాత్రం చాలా ఉండేదట‌. అందులో భాగంగానే ఆయన చాలా మాస్ సినిమాలో హీరోగా మెప్పించాడు. ఇక ప్రస్తుతం సైలేష్ కోల‌న్ డైరెక్షన్లో సైంధవ్‌ సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమా సక్సెస్ అయితే వెంకటేష్ ఇండస్ట్రీలో మరికొద్ది కాలం సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతాడంటంలో సందేహం లేదు.

అయితే వెంకటేష్ ఇప్పుడు చాలా సినిమాలు చేసిన ఆయన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ముద్ర వేసుకున్నాయి. వాటిలో ఒకటి రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన చంటి సినిమా. మీనా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ ఒక అమాయకపు పాత్రలో నటిస్తాడు. వెంకటేష్ లో ఉన్న కొత్త నటుడుని బయటికి తీసి ఈ సినిమా ద్వారా చూపించారు. ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన వెంకటేష్‌కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లోను, సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న వెంకటేష్ 60 ఏళ్లు పైబ‌డటంతో వయస్సుకి తగ్గ సబ్జెక్ట్ ని ఎంచుకుంటూ నటిస్తున్నడు.

ఒక క్యారెక్టర్ అనేది బతకాలంటే ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ మొత్తం ఆ సినిమాలో చూపించాల్సి ఉంటుంది అని వెంకటేష్ గట్టిగా నమ్ముతాడు. ఇక వెంకీ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన మరో సినిమా బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన బొబ్బిలి రాజా. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక అప్పటినుంచి వెంకటేష్‌ సినిమా కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు.