సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం టెలిసిందే.

వైసీపీ వైఫల్యాలు..టి‌డి‌పి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టి‌డి‌పి నేతలు, శ్రేణులు ప్రతి ఇంటికెళ్ళి వివరించనున్నారు. 3 కోట్ల మంది ఓటర్లని నేరుగా కలవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు. ఈ క్రమంలో బాబు రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో బాబు కార్యక్రమం మొదలవుతుంది.  మొదట రాయదుర్గం..పల్లేపల్లి గ్రామంలో వేరుశనగ రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని, ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత గుంతకల్ లో బాబు టూర్ ఉంటుంది. అటు నుంచి అటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళ్తారు. నంద్యాల, పాణ్యంలో పర్యటిస్తారు. ఇలా బాబు టూర్ సీమలో కొనసాగనుంది.

అయితే సీమలో వైసీపీని నిలువరించడం అంత తేలికైన విషయం కాదు. వైసీపీకి బాగా పట్టు ఎక్కువ. వైసీపీకి చెక్ పెట్టి కనీసం సగం సీట్లు సాధించడం అనేది టి‌డి‌పికి కష్టమైన పని. కొద్దో గొప్పో అనంతలో టి‌డి‌పికి పట్టు ఉంది..కానీ కడప, కర్నూలు, చిత్తూరుల్లో పట్టు లేదు. కాబట్టి ఎన్ని చేసిన సీమలో టి‌డి‌పి సత్తా చాటడం కష్టం.