తమన్నా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పబోతోందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ తమన్నా.. దాదాపుగా 18 సంవత్సరాల వరకు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన తమన్నా.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.. అవకాశాలు తగ్గుతున్న తరుణంలో పలు రకాల వెబ్ సిరీస్లలో బోల్డ్ గా నటించడమే కాకుండా సినిమాలలో గ్లామర్ తో కూడా కుర్రాలను ఆకట్టుకునేలా చేస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఇమే ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Tamannaah Bhatia Kisses Vijay Varma Making Their Relationship Official On  New Year's Eve At A Party In Goa? Viral Video Reports!

అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు తమన్నా.. ఇటీవల ఇద్దరు కూడా మాల్దీ వెకేషన్ కు వెళ్లి వచ్చారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.. గత కొద్దిరోజులుగా వీరిద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.. అక్కడక్కడ వీరికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన కామెంట్స్ చూస్తే తన ప్రియుడు విజయవరమాతో ఈమె బ్రేకప్ చెప్పుకుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయట..

This New Footage of Vijay Varma and Tamannaah Bhatia from Their Maldives  Vacay Goes Viral (Watch Video) | 🎥 LatestLY

తమన్నా ఇంటర్వ్యూలో ఇలా తెలియజేస్తూ “మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మన అనుకునే వ్యక్తుల వద్దకు వచ్చినప్పుడు అలాంటి మాటలు విన్నప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుందని తెలిపింది”.. చివరిగా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే ముఖ్యం అంటూ కూడా తెలియజేసింది తమన్నా..అయితే తమన్నా చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాకుండా మాల్దీవులకు వెళ్ళినప్పుడు వీరిద్దరి మధ్య ఒక గొడవ జరిగిందని ఆ గొడవల కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.