పుష్ప-2 ఏం క్రేజ్ రా సామి..ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్..!!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా రష్మిక నటించింది. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇటీవలే ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ క్రేజ్ కాస్త పెరిగిపోవడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప -2 చిత్రానికి ఏకంగా రూ .1000 కోట్లు ఆఫర్ వచ్చినట్టుగా ఒక విషయం వైరల్ గా మారుతోంది.

Pushpa 2 Release Date OUT, Film To Release On THIS Day

ఈ భారీ ఆఫర్ సౌత్ లో ఏ సినిమాకు ఈ రేంజ్ లో ఆఫర్ రాలేదని కూడా చెప్పవచ్చు. ఈ ఆఫర్ గురించి మైత్రి మూవీ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మైత్రి మూవీ మేకర్స్ వారు తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకుంటున్నాయి.. ఖుషి సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. పుష్ప-2 చిత్రానికి దాదాపుగా రూ.450 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు సమాచారం. దీంతో వీరు పెట్టిన బడ్జెట్ కంటే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప మొదటి భాగం కంటే రెండో భాగానికి ఎక్కువగా క్రేజ్ పెరిగిపోయిందని ఈ స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులోని కొన్ని పాత్రలు కూడా సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈసారి పుష్ప-2 చిత్రానికి గాను డైరెక్టర్కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.