మార్క్ ఆంథోని సినిమాలో సిల్క్ స్మితగా నటించింది ఎవరో తెలుసా..?

తమిళంలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తను నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంథోనీ.. ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..ఈ సినిమా ట్రైలర్ విడుదలై భారీగానే రెస్పాన్స్ అందుకుంటోంది. టైం ట్రావెల్ కథా అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడంతో ఈ సినిమాకు మరింత హైప్ ఏర్పడుతోంది.. ఈ చిత్రంలోని పలు పాత్రలు డబుల్ రోల్స్ లో కనిపించబోతున్నాయి.

Silk Smitha is back on big screen without help of technology - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

ట్రైలర్లో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంతో పాటుగా ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసేలా కనిపిస్తున్నాయి.. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చిత్రంలో సిల్క్ స్మితల ఒక అమ్మాయిని చూపించడంతో నిజంగానే ఈమె సిల్క్ స్మిత అనేలా అందరూ ఆశ్చర్యపరిచేలా చేశారు.. సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ అనే అమ్మాయి చేయడం జరిగిందట. సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారు ఈమెను జూనియర్ సిల్క్ స్మిత అని పిలుస్తూ ఉంటారట. సిల్క్ స్మితాను అచ్చుబుద్దినట్టుగా ఉండడమే కాకుండా ఆమె హావ భావాలు డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది.

అందుకే ఈమెను సిల్క్ స్మిత పాత్రకు గాను తీసుకున్నట్లు తెలుస్తోంది..ఇక విశాల్ ప్రత్యేకంగా ఈమెని ఎంపిక చేయించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమాతో ఈమె క్రేజీ ఏవిధంగా మారుతుందో చూడాలి. ఇందులో విశాల్ విభిన్నమైన పాత్రలలో నటిస్తూనే ఉన్నారు. అలాగే కమెడియన్ సునీల్ కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈసారి ఈ సినిమా తో విశాల్ సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.