అది చూపించమని హనీ రోజ్ ని బలవంతం చేసిన తెలుగు డైరెక్టర్.. మహా రసికుడే..!?

సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మళయాలి కుట్టి హనీ రోజ్ పేరు మారుమ్రోగిపోతుంది. మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హనీ రోజ్ .. తెలుగులో కూడా ఇప్పుడు అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . గతంలో తెలుగులో రెండు సినిమాలు చేసిన రాని గుర్తింపు బాలయ్య సరసన నటించిన వీరసింహారెడ్డి అనే సినిమాలో నటించగానే వచ్చేసింది .

ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ డ్యాన్స్ వేసి అభిమానులను తెగ ఆకట్టుకునింది. అయితే ఈ సినిమాలో హనీ రోజ్ ని చూస్ చేసుకోవడానికి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఆమె వద్ద నుండి రెండు సార్లు అడిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని చూస్ చేసుకున్న కొత్త బ్యూటీ అయితే బాగుంటుంది అంటూ హనీ రోజ్ ను ఫైనలైజ్ చేసుకున్నారట గోపీచంద్ .

అప్పుడు ఆమె ఇచ్చిన ఆడిషన్ ఓకే ఓకే అనిపించిందట . గోపీచంద్ ఆ తర్వాత మరోసారి బాలయ్య సినిమాలో నటించాలంటే మాస్ యాంగి కూడా కంపల్సరీ అని ఆమెలోని మాస్ యాంగిల్ ని బయట పెట్టమని.. పలు రకాల సీన్ చెప్పి ఆడిషన్స్ తీసుకున్నారట . అంతేకాదు ఆమె నాకు మాస్ పాత్రలంటే ఇష్టం లేదు.. క్లాస్ లుక్స్ నచ్చుతుంది అని చెప్పిన బలవంతంగా మాస్ యాంగిల్ చేయించి ఆమెలోని మా సాంగిల్ ని బయటపెట్టాడు గోపీచంద్ మల్లినేని. అంతేకాదు బాలయ్య -హనీ రోజ్ మధ్య కొన్ని నాటీ సీన్స్ కూడా తెరకెక్కించాడు . దీంతో అప్పట్లో గోపీచంద్ మల్లినేని మహా రసికుడే అన్న కామెంట్స్ కూడా వినిపించాయి..!!