రవితేజ ‘ టైగర్ ‘ మూవీ ఆంధ్ర బిజినెస్ అన్ని కోట్లా..!

మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావ్‌. స్టువర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందించారు. వంశి డైరెక్షన్లో, అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. సినిమా మార్కెటింగ్ ఈజీ అయ్యిందనే చెప్పాలి.

ఆంధ్ర ఏరియా మొత్తానికి సింగిల్ పాయింట్లో రైట్స్ కొనేశారట‌. వెస్ట్ గోదావరి కి చెందిన ఉషా బాలకృష్ణ ఆంధ్ర ఏరియాను రూ.18 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన కిందకు అమ్ముకుంటారు. నైజం ఏరియాను ఏషియన్ సినిమాస్ ద్వారా ఎప్పటిలాగే ఎన్ రిలీజ్ చేయబోతున్నారు. సిడెడ్, ఓవర్సీస్ క్లోజ్ చేయాల్సి ఉంది. ఓవర్‌సిస్‌కి కాస్త ఎక్కువ రేట్ కోట్‌ చేస్తున్నారు.

రూ 3.50 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. అందులో బయ్యర్లు కాస్త ముందు వెనక అడుగు వేస్తున్నప్పటికీ సీడెడ్‌ను ఇవాళో రేపో క్లోజ్ చేసేస్తారు. టైగర్ నాగేశ్వరరావు మంచి పోటీలో విడుదలవుతుంది. అటు బాలయ్య భగవంత్ కేసరి ఇటు విజయ్ లియో సినిమాల బరిలో ఉండగా ఈ రెండిటిని తట్టుకోగల టఫ్ కాంపిటీషన్ టైగర్ లో ఉందని బయ్యర్లు నమ్ముతున్నారు.