“ఎట్టకేలకు..నన్ను అర్ధం చేసుకునేవాడు దొరికేసారు”.. సమంత పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమెకు సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురి అవుతుంది . ఆమె కమిట్ అయిన సినిమా షూట్స్ ని ఫినిష్ చేసుకొని అమెరికా వెళ్ళిన సమంత అక్కడ న్యూయార్క్ లోని వీధుల్లో చక్కర్లు కొడుతుంది.

దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సమంత తన చేతిలో పెద్ద కాఫీ కప్ పట్టుకొని దర్శనం ఇచ్చింది . “అంతేకాదు ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికేశారు “అంటూ క్యాప్షన్ ఇచ్చింది . అయితే దీనంతటికీ కారణం ఆమె కాఫీ కి ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడం అంటూ తెలుస్తుంది . సమంత రకరకాల డైటింగ్ చేసిన కాఫీ మాత్రం బాగా తాగుతుంది .

ఈ క్రమంలోనే న్యూయార్క్ వెళ్ళినప్పటి నుంచి అమ్మడు కాఫీ కడుపునిండా తాగడమే మానేసిందట . ఆమెకు నచ్చిన కాఫీ అలా దొరకలేదట . ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనకు పెద్ద జంబో కాఫీ ని ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. కాగా గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ ఆమెతో కలిసి జీమ్ లో వర్క్ షేర్ చేసుకున్న వ్యక్తికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా వైరల్ అవుతుంది..!!