మిస్ శెట్టి రిలీజ్ వేళ యూనిట్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన అనుష్క‌… కండీష‌న్లు మామూలుగా లేవే..!

చాలాకాలం గ్యాప్ తర్వాత అనుష్క స్క్రీన్ పై కనిపించబోతోంది. మిస్‌సెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో నవీన్ పోలిశెట్టికి జంటగా ఈమె త్వరలోనే స్క్రీన్‌పై కనిపించబోతుంది. అయితే ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా ఉన్నా.. నవీన్ పోలీశెట్టికి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉండడం, అనుష్క కూడా స్టార్ హీరోయిన్ కావడంతో వీరి కాంబోపై ప్రేక్షకులో మంచి ఆశ‌క్తి ఉంది. యు వి బ్యానర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మిస్తున్న సినిమా కాబట్టి మరింత హైప్ పెరిగింది.

కానీ ఈ సినిమా ప్రమోషన్‌ల‌కు స్వీటీ రాదని టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌కి అనుష్క హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపు అందుకోబోతున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కి కూడా అనుష్క రాదట. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీకి మాత్రమే పరిమితం కావడంతో అనుష్క ప్రమోషన్స్ కు రావడం అంతగా అవసరం లేదనిపించింది. దీంతో నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్‌కి అనుష్క రాలేదు.

అయితే మిస్‌సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై ప్రేక్షకులు మంచిగా అంచనాలు ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనకపోతే ఆ లోటు అలానే ఉంటుంది. దీంతో అనుష్క ఎందుకు ప్రమోషన్స్‌కు రాదు అనే డౌట్స్‌ ప్రేక్షకుల్లో నెల‌కొన్నాయి. అనుష్క ఇటీవల వెయిట్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. బొద్దుగా కనిపించడంతో స్క్రీన్ పై డిఐ, సిజీలతో కాస్త స్లిమ్ గా చూపించారు. కానీ అదే ఫిజిక్‌తో మీడియా ముందుకు వస్తే బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో నన్ను సందేహంతో అనుష్క మీడియా ముందుకు రావడం లేదని తెలుస్తుంది. అందుకే ప్రమోషన్స్ డుమా కొట్టే ఛాన్స్ ఉందట‌.