ఫైనల్లీ అలా అభిమానుల కోరిక తీర్చబోతున్న బాలయ్య .. ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి(Video)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాశరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది . మరో రెండు నెలల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే బాలయ్య భగవంత్ కేసరి పై కొత్త కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఈ సినిమాలో బాలయ్య లుక్స్ టోటల్గా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రకారం తెలుస్తుంది . సోషల్ మీడియాలో భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ వైరల్ గా మారింది .

అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు . ఈ మేరకు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు . ఇందులో అందరు బాలకృష్ణ సినిమాలోని డైలాగులు చెబుతున్నారు కానీ అనిల్ రావిపూడి వచ్చేసరికి అందరి డైలాగులు చెప్తున్నారు ..పాట అప్డేట్ ఇస్తారని చెప్పారు . ఈ సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకు భగవంత్ కేసరి లోని ఫస్ట్ సింగిల్ విడుదల తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 31 గాని సెప్టెంబర్ ఒకటి గాని ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది మొత్తం గణేష్ ఉత్సవాలపై వచ్చే సాంగ్ గా తెలుస్తుంది . దీంతో అందరి దృష్టి ఇప్పుడు భగవంత్ కేసరి పైన పడింది..!!