జ్వరంలో స్నానం ఎలా చేయాలి… ఈ టెక్నిక్ త‌ప్ప‌క పాటించాలి..!

వర్షకాలంలో చాలా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మలేరియా, డెంగు, చికెన్ గున్యా , కండ్లకలక వంటి వ్యాధులు ఈ వర్షాకాలంలో వేగంగా ప్రసిద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. జ్వరం రావడంతో ప్రజలు శాంతం స్నానం చేయడం మానేస్తారు. ఎందుకంటే స్థానం చేయడం వల్ల జ్వరం మరింత పెరుగుతుందని వారు నమ్ముతారు. అలాగే జ్వరం వచ్చిన తరువాత తలస్నానం కూడా చాలామంది నిరాకరిస్తారు.

జ్వరం వచ్చినప్పుడు స్నానం చెయ్యాలా? వద్దా? అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్యాలు దగ్గరికి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు బాడీపెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే బలహీనత అనుభూతికి లోనవుతారు. ఈ క్రమంలో చాలామందికి స్నానం చేయాలని అనిపించదు. జ్వరం వచ్చిన వ్యక్తులు చల్లటి నీటితో స్నానం చేయకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఎందుకంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల్లో ఏర్పడిన నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పెరిగిన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. జ్వరం ఎక్కువగా ఉంటే పొరపాటున కూడా చల్లటి నీటితో స్నానం చేయకూడదు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కొన్నిసార్లు జ్వరం కారణంగా బద్ధకంగా ఉంటుంది. అప్పుడు చల్లటి నీళ్లలో ఒక క్లాత్ వేసి దానితో మీ వంటిని శుభ్రంగా తుడుచుకోండి అప్పుడు జ్వరం కూడా తగ్గుమొగులు పడుతుంది.