రావణుడి పాత్రను అద్భుతంగా పోషించిన పదిమంది నటులు వీరే..

సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది నటి నటులు ఉన్నారు. వారు ప్రేక్షకులను అలరించడం కోసం రకరకాల పాత్రలో నటిస్తూ ఉంటారు. నిజానికి ఒక పాత్ర పోషించాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక రామాయణం లాంటి కథల్లో నటించాలంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రామాయణంలో రావణుడి పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఈ పాత్రలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే రామాయణంలో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు. అంతెందుకు శివుడికి రావణుడు పరమభక్తుడు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ సీతా దేవిని ఎత్తుకెళ్లిన కారణంగా శ్రీ రాముడి చేతిలో హతమయ్యాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటులు రావణుడి పాత్రని అద్భుతంగా పోషించారు. ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు. ఆయన ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయేవారు. ఎన్టీఆర్ ‘శ్రీ కృష్ణుడి’ పాత్ర వేసినప్పుడు థియేటర్ లు దద్దరిల్లాయి. అలానే ఆయన రావణుడి పాత్ర కూడా పోషించి అద్భుతంగా నటించారు. శ్రీరామ పట్టాభిషేకం , సీతారామ కళ్యాణం ఇలా ఎన్నో సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించి మెప్పించారు ఎన్టీఆర్.

ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు గురించి చెప్పనవసరం లేదు. ఆయన చేసిన పాత్రలు, సినిమాలు ఎప్పటికి ప్రేక్షకులకు గుండెల్లో గుర్తుండిపోతాయి. ఎస్వి రంగారావు కూడా ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో రావణుడి పాత్రలో నటించి మెప్పించారు.
కైకాల సత్యనారాయణ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి గుర్తింపు తెచ్చుకున్నా ఈయన ‘సీతా కళ్యాణం’ సినిమాలో రావణుడి పాత్రలో అద్భుతంగా నటించారు.

సీత: ఏంటి అమ్మాయి పేరు చెబుతూ రావణుడి పాత్ర చేసారు అని చెబుతున్నాం అనుకుంటున్నారా, 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమా గుర్తుందా. ఈ సినిమాలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించగా రావణుడిగా స్వాతి బాలినేని అనే బాలిక నటించింది

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో ‘ఆదిపురుష్ ‘ ఒకటి. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. అలానే ‘రామాయణ’ సీరియల్‌ లో అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో నటించగా, ‘భూ కైలాస్ ‘  అనే చిత్రంలో కన్నడ నటుడు రాజ్ కుమార్ రావణుడిగా నటించారు. అంతేకాకుండా మెగా బ్రదర్ నాగబాబు కూడా ‘ శ్రీ రామదాసు’ సినిమాలో రావణుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ‘భారత్ ఏక్ ఖోజ్’  మూవీలో ఓం పురి రావణుడిగా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.