బాలయ్య భగవంత్‌న్ కేసరి హరికృష్ణ సినిమాకి కాఫీనా..!

భగవంత్ కేసరి సినిమా రీమేక్ కథతో తెరకెక్కబోతుందంటూ ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పై నిర్మాణ సంస్థ షైనీ స్క్రీన్స్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య సోదరుడు, దివంగత నటుడు హరికృష్ణ హీరోగా నటించిన స్వామి ఆధారంగా భగవంత్ కేసరి సినిమా రూపొందుతుందని వార్తలు వైర‌ల్ అయ్యాయి. స్వామి సినిమాకు వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు.

తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి కథతో తెరకెక్కిన స్వామి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది. స్వామి సినిమాని రీమేక్ చేస్తూ అనిల్ రవిపూడి భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లను నిర్మాణ సంస్థ షైన్ క్రియేషన్స్ ఖండించింది. రీమేక్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. గత సినిమాలకు భిన్నంగా బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తాడని వివ‌రించింది. అభిమానులు థ్రిల్‌ అయ్యేలా బాలయ్య క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు.

భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శ‌ర వేగంగా జరుగుతుంది. సోమవారంతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సీన్స్ పూర్తయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఈ చిత్రానికి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.