అనుపమ అందం గుట్టు రట్టు… శోకసంద్రంలో అభిమానులు?

రింగు రింగుల జుట్టు గల సుందరి అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చెలిసిన పనిలేదు. కేరళ బ్యూటీ అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో జెండా పాతింది. తన అందం, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు కుర్రాళ్లకు ఆరాధ్య దేవత అయిపోయిందనే చెప్పుకోవాలి. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో ఆకట్టుకున్న అనుపమ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

ఈ క్రమంలో ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు ఈ ముద్దుగుమ్మకు మంచి పేర్లు తెచ్చి పెట్టాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. అవును, అనుపమ నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది. అందులో తను ఫన్నీ ఫిల్టర్ తో ఉన్న ఫోటో షేర్ చేసుకుంది. ఇక అందులో ఆమె కళ్ళు చాలా పెద్దగా, చెంపలు లోపలికి పోయినట్లు కనిపించింది. దాంతో అభిమానులు ఆమె అందం పట్ల నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది.

అది అబద్ధం అని తెలిసినా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరెప్పుడూ ఇలాంటి పెట్టవద్దని ఆమెకి సలహాలు ఇస్తున్నారు. అయితే ఆ ఫోటో చూసి సాధారణ ప్రేక్షకుడు అనేవాడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. భలే అందంగా ఉన్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేసి బాగా బిజీ గా ఉంది. అప్పుడప్పుడు బుల్లితెర షో లలో పాల్గొని కూడా బాగా సందడి చేస్తుంది. ఒక స్టార్ పొజిషన్ లో కూడా ఏ మాత్రం గర్వం చూపించకుండా అందరితో ఫ్రీ గా ఉంటూ సందడి చేస్తుంది.

Share post:

Latest