ఓ ఇంటి వాడు అయిన డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ పిక్స్‌!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాదులో పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వెంకీ-పూజ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.

అలాగే టాలీవుడ్ కు చెందిన హీరో నితిన్, ఆయన సతీమణి శాలినీ, ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కొడుముల వీరి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నితిన్ వెంకీ అట్లూరికి సోషల్ మీడియా ద్వారా కూడా బెస్ట్ విషెస్ ను తెలిపారు.

నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫోటోను నితిన్ సోష‌ల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. `జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్న వెంకి స్వామికి కంగ్రాట్స్. పూజాతో నీ జీవితం మరింత అందంగా మారాలని కోరుకుంటున్నా` అంటూ నితిన్ పోస్ట్ పెట్టాడు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి వెడ్డింగ్ పిక్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈ నెలలో వెంకీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సార్` చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్‌, సంయుక్త మీనన్ ఇందులో జంటగా నటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదల కాబోతోంది. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Share post:

Latest